Boulders: తిరుమల ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు

Boulders fell down on ghat road at Tirumala
  • తిరుమలలో భారీ వర్షాలు
  • రహదారిపై పడిన బండరాళ్లు
  • నిలిచిపోయిన వాహనాలు
  • తీవ్రంగా శ్రమించి బండరాళ్లను తొలగించిన టీటీడీ సిబ్బంది
తిరుమలలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఘాట్ రోడ్డుపై ఈ ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనాల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది భారీ బండరాళ్లను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. రాళ్ల తొలగింపు అనంతరం వాహనాలకు అనుమతి ఇచ్చారు.

కాగా, తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇటీవల నివర్ తుపాను సందర్భంగా తిరుమలలో కుండపోత వానలు కురిశాయి. మాఢవీధుల్లో సైతం వరదలు వచ్చాయి. స్వామివారి పుష్కరిణి నిండిపోయింది. గోగర్భం, ఆకాశగంగ డ్యాములు జలకళతో పరవళ్లు తొక్కుతున్నాయి.
Boulders
Ghat Road
Tirumala
TTD
Rains

More Telugu News