Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantha to start OTT platform
షార్ట్స్‌లో చూడండి
*  ఓపక్క సినిమాలలో నటిస్తూ .. మరోపక్క వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన అందాలతార సమంత తాజాగా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోంది. ఓటీటీ సంస్థను నెలకొల్పడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది. త్వరలోనే వివరాలు వెల్లడవుతాయి.
*  బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో నిన్నటితరం కథానాయిక మీనా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో బాలయ్యకు మీనా భార్యగా కనిపిస్తుందని అంటున్నారు.
*  హిందీలో హిట్టయిన 'అంధాదున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న దుబాయ్ లో మొదలైంది. నితిన్, నభా నటేష్ జంటపై కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
*  సాయితేజ్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నూతన దర్శకుడు రామ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజక్టుకి సాయితేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రామ్ గతంలో కృష్ణవంశీ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇదిలావుంచితే, సాయితేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రాన్ని ఈ నెల 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
Go Back to Shorts
Samantha
Nagarjuna
Balakrishna
Nithin

More Telugu News