Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 కొత్త కేసులు

Lowest corona cases in Kurnool district
షార్ట్స్‌లో చూడండి
 ఏపీలో గడచిన 24 గంటల్లో 60,329 కరోనా టెస్టులు నిర్వహించగా 667 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 129 కొత్త కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 114, చిత్తూరు జిల్లాలో 105 కేసులు గుర్తించారు. ఇక కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 కేసులు వెల్లడయ్యాయి. విశాఖ జిల్లాలో 15, విజయనగరంలో 18, కడప జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 33, ప్రకాశం జిల్లాలో 36 కేసులు గుర్తించారు.

అదే సమయంలో రాష్ట్రంలో 914 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,71,972 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,59,029 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,910కి దిగొచ్చింది. మొత్తం మరణాల సంఖ్య 7,033కి చేరింది.
Go Back to Shorts
Corona Virus
Kurnool District
Lowest
Positive Cases
Andhra Pradesh

More Telugu News