India: దేశంలో కొత్తగా 36,011 మందికి కరోనా నిర్ధారణ

 Indias total cases rise to 9644222
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 36,011 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,44,222 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,970 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 482 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,182 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,00,792  మంది కోలుకున్నారు. 4,03,248 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,69,86,575 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,01,063  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News