రేపు ఢిల్లీకి వెళ్తున్న బండి సంజయ్.. అధిష్ఠానంతో చర్చలు!

05-12-2020 Sat 15:56
  • గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్తున్న సంజయ్
  • అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం
  • భవిష్యత్ కార్యాచరణపై  చర్చించే అవకాశం
Bandi Sanjay going to Delhi

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సంజయ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీలను సంజయ్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల వివరాలను ఢిల్లీ పెద్దలకు సంజయ్ వివరించనున్నారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపైనా చర్చించనున్నారు.