Car: నిజామాబాద్ జిల్లాలో ఇద్దరిని బలిగొన్న కారు... త్రుటిలో తప్పించుకున్న చిన్నారులు... వీడియో ఇదిగో!

Speeding car kills three in Nizamabad district
  • బడా భీమ్ గల్ లో ఘటన
  • బైక్ పై ఉన్న వ్యక్తిని ఈడ్చుకెళ్లిన వాహనం
  • అదే ఊపులో హోటల్లోకి దూసుకెళ్లిన వైనం
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ లో కారు బీభత్సం చోటుచేసుకుంది. ఓ మహీంద్రా కారు అతివేగంగా దూసుకొచ్చి బైక్ పై ఉన్న భూమన్న అనే వ్యక్తిని బలి తీసుకోవడమే కాకుండా, హోటల్ లో ఉన్న భూదేవి, చిన్న రాజన్న అనే మరో ఇద్దరిని కూడా ఢీకొట్టింది.

ఈ ఘటనలో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, మహీంద్రా వాహనం హోటల్లోకి దూసుకొచ్చిన ప్రదేశంలోనే కొన్ని క్షణాల ముందు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారు కొంచెం ముందుకెళ్లడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కాగా, మహీంద్రా వాహనంలో ఉన్నది డబుల్ బెడ్ రూం ఇళ్ల కాంట్రాక్టర్ అని వెల్లడైంది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Car
Road Accident
Bheemgal
Nizamabad District

More Telugu News