Rajinikanth: ఎవరినీ తిట్టం, ఎవరినీ కొట్టం... అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: రజనీకాంత్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు

Tamilaruvi Manian says Rajini party will be contest in all seats
  • పార్టీ స్థాపించబోతున్న రజనీకాంత్
  • ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తామన్న రాజకీయ సలహాదారు
  • 234 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో దిగుతారని వెల్లడి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన రాజకీయ సలహాదారుగా, పార్టీ ఏర్పాటు చర్యల పర్యవేక్షకుడిగా తమిళరువి మణియన్ ను నియమించారు.

తాజాగా తమిళరువి మణియన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ రాజకీయాలు ఆధ్యాత్మిక పంథాలో కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి విద్వేషాలకు చోటు లేదని స్పష్టం చేశారు. తాము ఎవరినీ తిట్టబోమని, ఎవరినీ కొట్టబోమని, తమ రాజకీయాలు ఇలాగే ఉంటాయని వివరించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. మొత్తం 234 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో దిగుతారని వివరించారు. రజనీ స్థాపించబోయే పార్టీతో పొత్తులకు అధికార అన్నాడీఎంకే ఆశపడుతున్న నేపథ్యంలో తమిళ్ రువి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Rajinikanth
Party
Tamilaruvi Manian
Tamilnadu

More Telugu News