గ్రేటర్ ఫలితాలు: విజయం సాధించిన డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్

04-12-2020 Fri 14:49
  • కొనసాగుతున్న కౌంటింగ్
  • బోరబండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఫసియుద్దీన్ గెలుపు
  • మంగళ్ హాట్ లో బీజేపీ అభ్యర్థి శశికళ విజయం
Deputy Mayor Baba Fasiyuddin wins Borabanda division

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనేక డివిజన్ల ఫలితాలు వెలువడుతున్నాయి. బోరబండ డివిజన్ లో డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ నేత బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు. ఫసియుద్దీన్ గెలుపుతో బోరబండ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. గతంలో లేని విధంగా ఈసారి జీహెచ్ఎంసీ బరిలో దూసుకువస్తున్న బీజేపీ తొలి విజయం నమోదు చేసుకుంది. మంగళ్ హాట్ డివిజన్ కమలం పార్టీ అభ్యర్థి శశికళ నెగ్గారు. అనేక డివిజన్లలో బీజేపీ అధికార టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఏఎస్ రావు నగర్ లో ఆ పార్టీ అభ్యర్థి శిరీషా రెడ్డి విజయం సాధించారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 3 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 42 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. 8 డివిజన్లను తన ఖాతాలో వేసుకున్న ఎంఐఎం పార్టీ 20 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.