హెచ్1బీ వీసాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఫేస్ బుక్ పై దావా
- ఫేస్ బుక్ వివక్ష ప్రదర్శిస్తోందన్న అమెరికా ప్రభుత్వం
- ఉద్దేశపూర్వకంగానే అమెరికన్లను నిరాకరిస్తోందంటూ ఆరోపణలు
- అమెరికా న్యాయవిభాగానికి సహకరిస్తామన్న ఫేస్ బుక్
అర్హులైన అమెరికన్లకు మొండిచేయి చూపేలా ఫేస్ బుక్ ఉద్దేశపూర్వకంగానే ఓ నియామక విధానాన్ని రూపొందించి అమలు చేస్తోందని తెలిపింది. అంతేకాకుండా, శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డులు కోరుకుంటున్న తాత్కాలిక వీసాదారులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఫేస్ బుక్ పై న్యాయస్థానంలో దావా వేసింది.
దీనిపై ఫేస్ బుక్ ప్రతినిధి డేనియల్ రాబర్ట్స్ స్పందిస్తూ, అమెరికా న్యాయ విభాగానికి ఫేస్ బుక్ సహకరిస్తుందని, ఆరోపణలకు బదులిస్తామని తెలిపారు. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున ఇంతకుమించి స్పందించలేమని అన్నారు.