దేశవ్యాప్త సమ్మెకు దిగుతాం: ఆల్ ఇండియా టాక్సీ యూనియన్ హెచ్చరిక!
- రెండు రోజుల్లో రైతుల డిమాండ్లను పరిష్కరించాలి
- లేకుంటే 3 నుంచి టాక్సీల బంద్
- యూనియన్ అధ్యక్షుడు బల్వంత్ సింగ్
"ప్రధాని, హోమ్ మంత్రులకు ఈ మేరకు ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలి. ఇవి అమలులోకి వస్తే, కార్పొరేట్లు మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేస్తారు. రెండు రోజుల్లో చట్టాలను ఉపసంహరించుకోకుంటే, రోడ్లపై ఉన్న మా వాహనాలను తొలగిస్తాం. దేశవ్యాప్తంగా డ్రైవర్లు అందరూ 3వ తేదీ నుంచి సమ్మెకు దిగుతారు" అని ఆయన అన్నారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, ప్రభుత్వాలు మాత్రం వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.