తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

01-12-2020 Tue 09:26
  • 24 గంటల్లో 502 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,70,318
  • కోలుకున్న వారు 2,59,230 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,461
new 502 COVID19 infections in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో 502 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 894 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,70,318కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,59,230 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,461కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 9,627 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 7,586 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 32 కేసులు నిర్ధారణ అయ్యాయి.