Nara Lokesh: గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించండి: జగన్‌పై లోకేశ్ విమర్శలు

lokesh slams jagan
షార్ట్స్‌లో చూడండి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ‘గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా వైఎస్ గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే అధికారంలోకొచ్చాక 5 వంద‌ల రూపాయలు ఇస్తామనడం రివర్స్ టెండరింగ్‌లో భాగ‌మా? నివర్ తుపాను 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి రైతన్న నడ్డి విరిచింది. సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి కోట్లపైన పంట నష్టం వాటిల్లింది’ అని చెప్పారు.

‘వరుస తుపాన్లు, వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వెయ్యరు, పరిహారం ఇవ్వరు. గాల్లో మేడ‌లు క‌డుతూ, గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తే అంతులేని తుపాను‌న‌ష్టం తెలుస్తుంది. మీ సాక్షి మీడియా ప్ర‌క‌ట‌న‌లు, భజన బ్యాచ్ నుంచి వాస్త‌వంలోకొస్తే అన్న‌దాత‌ల ఆర్త‌నాదాలు విన‌ప‌డ‌తాయి. తాడేప‌ల్లి గ‌డ‌ప దాటి ప్ర‌జ‌ల్లోకొస్తే జ‌నం క‌న్నీళ్లు క‌నిపిస్తాయి’ అని చెప్పారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP
Jagan

More Telugu News