క్రికెటర్ షమీ భార్యను వేధిస్తున్న 25 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
- షమీకి దూరంగా ఉన్న హసీన్ జహాన్
- కొంత కాలంగా వేధిస్తున్న కోల్ కతాకు చెందిన వ్యక్తి
- డబ్బులు ఇవ్వాలని డిమాండ్
ఈ సందర్భంగా పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ, డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని దుండగుడు బెదిరిస్తున్నాడని తెలిపారు. ఫోన్ చేసి తిట్టేవాడని, ఫోన్ ఎత్తకపోతే పదేపదే ఫోన్లు చేసేవాడని చెప్పారు. ఆ వేధింపులను భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించిందని అన్నారు. మంగళవారం రాత్రి అతన్ని అరెస్ట్ చేశామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.