Nidhi Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పవన్ కల్యాణ్ తో జతకట్టనున్న నిధి! 
  • జనవరి నుంచి అఖిల్ కొత్త సినిమా
  • 'రాధే శ్యామ్'లో కీలక పాత్రలో జీవీ ప్రకాశ్
Nidhi Agarwal opposite Pawan Kalyan

*  ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో కథానాయికగా 'ఇస్మార్ట్ భామ' నిధి అగర్వాల్ నటించే అవకాశం వుంది. ప్రస్తుతం చిత్రం యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
*  అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. అనిల్ సుంకర నిర్మించే ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి జరుగుతుంది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో కథానాయికగా రష్మిక నటిస్తుందని సమాచారం.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు అయిన జీవీ ప్రకాశ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇందులో హీరోకి తమ్ముడి పాత్రలో ప్రకాశ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తదుపరి షూటింగ్ వచ్చే వారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

More Telugu News