పాకిస్థాన్ తవ్వకాల్లో బయటపడిన 1300 ఏళ్లనాటి విష్ణువు ఆలయం
- స్వాత్ జిల్లాలో ఇటలీ, పాక్ దేశాల నిపుణుల తవ్వకాలు
- హిందూషాహి రాజులు ఆలయాన్ని నిర్మించి ఉంటారన్న అధికారులు
- వాచ్ టవర్ జాడలు కూడా లభ్యం
చరిత్ర ప్రకారం క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో హిందూషాహి పాలకులు పాలించారు. వీరిని హిందూషాహీలు లేదా కాబూల్ షాహీలు అని పిలుస్తారు. దీన్ని ఒక హిందూ రాజ్యవంశంగా చెపుతారు. వీరు వాయవ్య భారత ప్రాంతాన్ని పాలించినట్టు కూడా చరిత్రలో ఉంది. ఈ రాజ్యవంశీకులే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెపుతున్నారు. మరోవైపు, ఆలయ పరిసర ప్రాంతాల్లో వాచ్ టవర్, జాడలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.