కరోనాతో కన్నుమూసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ
- గత నెల పదో తేదీ నుంచి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స
- ఈ నెల 3న మరింత దిగజారిన ఆరోగ్యం
- వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం శూన్యం
చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ మెట్రిక్యులేషన్ చదువుకున్నారు. ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన డీకే ఆదికేశవులు నాయుడు కాంగ్రెస్‌లో మంచి పేరున్న నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన 2004లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. 2013లో అనారోగ్యంతో ఆయన మృతి చెందిన తర్వాత సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.