‘గ్రేటర్’ వార్.. 105 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్

18-11-2020 Wed 21:33
  • టీఆర్ఎస్‌ను వెంటాడుతున్న దుబ్బాక ఓటమి
  • అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త
  • చాలా స్థానాల్లో సిట్టింగులకే అవకాశం
TRS Released first list for GHMC Elections

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి వెంటాడుతుండడంతో గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీపడే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన టీఆర్ఎస్.. అభ్యర్థుల ఎంపికలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం 105 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. చాలా వరకు సిట్టింగులకే టికెట్లు కేటాయించింది. మిగిలిన 45 మందితో కూడిన జాబితాను రేపు విడుదల చేయనుంది.