లాక్ డౌన్ లో నేను చేసిన గొప్ప పని ఇదే: హీరోయిన్ రాశీ ఖన్నా!

16-11-2020 Mon 09:53
  • లాక్ డౌన్ లో షూటింగ్స్ లేక ఇంటికే పరిమితం
  • తమిళం నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్నా
  • దీపావళి వేడుకల సందర్భంగా రాశీ ఖన్నా
Rashi Khanna Learn Tamil in Lockdown

కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చి, తాను ఇంట్లో ఉన్న సమయంలో తమిళం మాట్లాడటం నేర్చుకున్నానని, ఆ సమయంలో తాను చేసిన గొప్ప పని అదేనని హీరోయిన్ రాశీ ఖన్నా తెలిపింది. ప్రస్తుతం తమిళనాడులో ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న ఆమె, దీపావళి కోసం ముంబై వచ్చింది. తన కుటుంబ సభ్యులతో పండగ వేడుకల్లో పాల్గొన్న ఆమె, మీడియాతో మాట్లాడుతూ, కోలీవుడ్ లో తనకు విజయ్ అంటే ఎంతో ఇష్టమని, అతనితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది.

ఇదే సమయంలో ఏదైనా ఓ చారిత్రక చిత్రంలో నటించే చాన్స్ ను కూడా తాను కోరుకుంటున్నానని తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉన్న వేళ తమిళం నేర్చుకున్నానని, ఇప్పుడు తాను చక్కగా మాట్లాడగలనని ఆనందంగా చెప్పుకొచ్చిందీ బొద్దుగుమ్మ.