Junior NTR: హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. అభిమానుల హడావిడి!

ntr pics go viral

  • కామన్ డీపీను పోస్టు చేస్తోన్న అభిమానులు 
  • #2DecadesOfNTREra పేరుతో హ్యాష్ ట్యాగ్
  • నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్
  • ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయనకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఫొటోలు, కామన్ డీపీను అభిమానులు #2DecadesOfNTREra పేరుతో పోస్ట్ చేస్తున్నారు.
     
నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత  స్టూడెంట్ నం.1, ఆది, సింహాద్రి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. యమదొంగ, అదుర్స్, బృందావనం, బాద్షా, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వంటి సినిమాలతో టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.  
 

  • Loading...

More Telugu News