Virat Kohli: టీమిండియా సారథి కోహ్లీపై ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ప్రశంసల వర్షం!

Aussies ex cricketer mark taylor praises virat kohli
  • కోహ్లీ ఆదర్శవంతమైన ఆటగాడు
  • అతడి ఆట సహజ సిద్ధంగా ఉంటుంది
  • క్రికెట్‌ను కోహ్లీ ఎంతగానో ప్రేమిస్తాడు
టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని ఆదర్శవంతమైన క్రికెటర్‌గా అభివర్ణించాడు. అతడి ఆట సహజ సిద్ధంగా ఉంటుందని, ఆటను గౌరవిస్తాడని పేర్కొన్నాడు. దూకుడు కొంత ఎక్కువే అయినప్పటికీ క్రికెట్‌లో ఆదర్శంగా నిలుస్తాడని కొనియాడాడు.

కాగా, భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు వన్డేలు, మూడు టీ20, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 27 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు నిబంధనల ప్రకారం అక్కడ క్వారంటైన్‌లో ఉంది.  కాగా, కోహ్లీ భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంతో తొలి టెస్టు అనంతరం కోహ్లీ భారత్ తిరిగి రానున్నాడు.
Virat Kohli
mark taylor
Team India
Australia

More Telugu News