Father: కొడుకు పుడతాడని ఆశలు రేకెత్తించిన భూతవైద్యుడు... కూతుర్ని బలిచ్చిన కసాయి తండ్రి!

Father who wants a son killed own daughter
షార్ట్స్‌లో చూడండి
భారత్ లో అనాదిగా మూఢ నమ్మకాలు ఉంటూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, నగరాలు అని తేడా లేకుండా నేటికీ భూతవైద్యులు చెలామణీలో ఉన్నారంటే అందుకు కారణం మూఢ నమ్మకాలే. ప్రజల అజ్ఞానం, మంత్రగాళ్ల దురాశ.. వెరసి అనేక దారుణాలకు దారితీస్తున్నాయి. జార్ఖండ్ లో ఓ వ్యక్తి కొడుకు పుడతాడన్న ఆశతో కన్న కూతుర్నే బలిచ్చిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

రాంచీలో నివసించే సుమన్ నాగస్యా ఓ రోజుకూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. కొడుకులు లేరని నిత్యం అసంతృప్తికి గురవుతుండేవాడు. ఈ క్రమంలో సుమన్ నాగస్యా ఓ భూతవైద్యుడిని కలిశాడు. తనకు కొడుకులు లేరన్న విషయం చెప్పి అతడిని సలహా అడిగాడు. అయితే ఆ మంత్రగాడు, కొడుకు పుట్టాలంటే కూతుర్ని బలివ్వాలని చెప్పాడు.

అది నిజమేనని నమ్మిన సుమన్ మరేమీ ఆలోచించకుండా ఉన్మాదంతో కూతుర్ని తల నరికి బలిచ్చాడు. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు కిరాతక తండ్రి సుమన్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భూతవైద్యుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
Father
Daughter
Son
Murder
Jharkand

More Telugu News