Woman: భర్తను వదిలేసి, కొడుకును చంపేసి... ప్రియుడి కోసం బరితెగించిన యువతి!

 Woman killed her son in the wake of illegal affair
  • పెళ్లికి ముందే మరో వ్యక్తితో సంబంధం
  • పెళ్లి తర్వాత కూడా సంబంధం కొనసాగించిన యువతి
  • భర్తతో విభేదాలతో పుట్టింటికి చేరిక
  • అడ్డొస్తున్నాడని కొడుకును హత్య చేసిన వైనం
వివాహేతర సంబంధాల మోజులో పచ్చని కాపురాలు బుగ్గిపాలు చేసుకుంటున్న వారు దేశంలో అనేకమంది కనిపిస్తారు. నిజమాబాద్ జిల్లా తొర్తి గ్రామానికి చెందిన నవ్య కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఐదేళ్ల కిందట పెళ్లి కాగా, వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు కన్నబిడ్డ అడ్డుగా ఉన్నాడని ఆ చిన్నారిని కూడా చంపేసి మాతృత్వానికి మాయని మచ్చలా నిలిచింది.

నవ్యకు తాళ్లరాంపూర్ కు చెందిన అభిషేక్ తో వివాహం జరిగింది. వీరికి నాగేంద్ర అనే కుమారుడు ఉన్నాడు. నాగేంద్ర వయసు నాలుగేళ్లు. అయితే వివాహానికి ముందే మరో యువకుడితో నవ్యకు సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో అభిషేక్ తరచుగా నిలదీసేవాడు. ఆ విధంగా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు వచ్చాయి.

దాంతో భర్త నుంచి విడిపోయిన నవ్య కొడుకుతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఉపాధి కోసం అభిషేక్ అరబ్ దేశాలకు వెళ్లాడు. అయితే తన అక్రమ సంబంధానికి కొడుకు అడ్డొస్తున్నాడని భావించి నవ్య దుర్మార్గానికి తెరదీసింది. నిద్రపోతున్న ఆ నాలుగేళ్ల చిన్నారిని రాక్షసంగా గొంతు నులిమి చంపేసింది. బాలుడు ఎలా చనిపోయాడో తనకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో నవ్యను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో ఆమె నిజం కక్కేసింది. ప్రియుడి మోజులో తానే కడతేర్చినట్టు వెల్లడించింది. దాంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.
Woman
son
Nizamabad District
Illegal Affair
Murder

More Telugu News