కొడుకు ఆన్ లైన్ క్లాసుల కోసం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని రోజంతా పోలీస్ స్టేషన్ లో గడిపిన మహిళ
- ముంబయిలో ఘటన
- అది చోరీకి గురైన ఫోన్ అంటూ యువతిని పీఎస్ కు తీసుకెళ్లిన పోలీసులు
- ఆమెకేమీ తెలియదని ఇంటికి పంపించేసిన వైనం
- విషయం తెలుసుకుని కొత్త ఫోన్ బహూకరించిన పోలీసు ఉన్నతాధికారులు
ఇక, స్వాతి ఆ ఫోన్ లో సిమ్ వేసుకుని వాడడం ప్రారంభించిందో లేదో, పోలీసులు ఆమె ఇంటికి వచ్చారు. అది చోరీకి గురైన ఫోన్ అంటూ ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఒకరోజంతా ఆమెను స్టేషన్ లోనే ఉంచి అన్నివిధాలుగా ప్రశ్నించారు. చివరికి ఆ ఫోన్ చోరీతో ఆమెకు సంబంధం లేదని ఇంటికి పంపించేశారు. ఈ విషయాన్ని స్వాతి తాను పనిచేసే ఇంటి యజమానికి చెప్పడంతో ఆయన ఈ వ్యవహారాన్ని ట్విట్టర్ ద్వారా ముంబయి పోలీసులకు తెలియజేశారు.
దాంతో వెంటనే స్పందించిన ముంబయి పోలీసు అధికారులు ఓ కొత్త సెల్ ఫోన్ ను స్వాతికి అందించారు. ఆమె కొడుకు చదువుల కోసం ఆ ఫోన్ ఉపయోగించుకోవాలంటూ చెప్పారు. కొత్త ఫోన్ రావడంతో స్వాతి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. తన పరిస్థితిని గమనించి సాయం చేసిన ముంబయి పోలీసు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.