రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో భేటీ
- దుబ్బాక ఫలితంపై విశ్లేషించనున్న కేసీఆర్
- జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించే అవకాశం
ఈ సమావేశంలో దుబ్బాక ఫలితం అంశం తప్పకుండా చర్చకు వస్తుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సీఎం కేసీఆర్ విశ్లేషించే అవకాశాలున్నాయి. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశంపైనా కీలక చర్చ జరగనుంది. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలపై ఆయన మంత్రులతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.