Corona Virus: భారత్‌లో కొత్తగా 47,905 కరోనా కేసులు...550 మరణాలు

47905 new corona cases in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 47,905 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,83,917 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 52,718 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 550 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,28,121 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 80,66,502 మంది కోలుకున్నారు. 4,89,294 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              

 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,19,62,509  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,93,358  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News