కరోనాకు బలైన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ జీనా
- ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఇటీవలే గుండెపోటుతో ఆయన భార్య మృతి
- సాల్ట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక
ఆయన భార్య ఇటీవలే గుండెపోటుతో మృతి చెందారు. అంతలోనే జీనా మృతి ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 8 డిసెంబరు 1969లో అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో జీనా జన్మించారు. 2007లో తొలిసారి బిక్యాసెన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.