దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని నరేంద్రమోదీ
- ఈ విజయం చారిత్రాత్మకం
- ఈ గెలుపు మరింత శక్తిని ఇచ్చింది
- అవినీతి, రాచరిక పాలనకు వ్యతిరేకంగానే ఈ ఫలితం: నడ్డా
ఇక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1,079 ఓట్లతో విజయం సాధించారు. గెలిచిన రఘునందన్‌రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దుబ్బాకలో విజయం సాధించేందుకు కృషి చేసిన కార్యకర్తలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు షా అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ అవినీతికి, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఈ ఫలితాలు వెలువడ్డాయని నడ్డా అన్నారు.