చరిత్ర సృష్టించిన బీజేపీ.. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటమి!
- 1,470 ఓట్ల మెజార్టీతో బీజేపీ విజయం
- చివరి రౌండ్ వరకు దోబూచులాడిన విజయం
- రెండో స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్
ఈ ఎన్నికలో బీజేపీ 62,772 ఓట్లను సాధించింది. 61,320 ఓట్లను సాధించిన టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 21,819 ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. బీజీపీ గెలుపును కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.
గతంలో దుబ్బాక నుంచి రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు.. మూడో ప్రయత్నంలో ఘన విజయం అందుకున్నారు. బీజేపీ గెలుపుతో హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.