దుబ్బాకలో మారిన ట్రెండ్.. ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం
- ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు 353 ఓట్ల ఆధిక్యత
- మొత్తంమీద 2,667 ఓట్ల ఆధిక్యతలో బీజేపీ
- మరో 17 రౌండ్లను లెక్కించాల్సి ఉంది
ఆరో రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 20,226, టీఆర్ఎస్ కు 17,559, కాంగ్రెస్ కు 3,254 ఓట్టు వచ్చాయి. మొత్తం మీద 2,667 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యతలో ఉన్నారు. ఇప్పటి వరకు దుబ్బాక మండలం, పురపాలక సంఘం పరిధిలోని ఓట్లను లెక్కించారు. మరో 17 రౌండ్లను లెక్కించాల్సి ఉంది.