Devineni Uma: బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరానికి గ్రహణం పట్టిస్తున్నారా?: దేవినేని ఉమ

devineni uma slams jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. 2022లో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితమిస్తామని, ఆ ఏడాది 2022 ఖరీఫ్ సీజన్ కు ఆ ప్రాజెక్టు నుంచి నీటిని ఇస్తామని జగన్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

‘పోలవరానికి 55,548 కోట్ల రూపాయలకు టీఏసీలో చంద్రబాబు నాయుడు అనుమతులు తెచ్చి, 70 శాతానికి పైగా పూర్తిచేశారు. అసమర్థతతో నిధులు సాధించలేక పోలవరం ప్రాజెక్టును బలిచేస్తున్నారా? నాడు 2021 జూన్ అన్నారు, నేడు 2022 ఖరీఫ్ అంటున్నారు. ఆంధ్రుల జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరానికి గ్రహణం పట్టిస్తున్నారా? వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా, జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు, నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆయన పోస్టు చేశారు.
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News