Vijayashanti: ఇటీవల ఢిల్లీలో జేపీ నడ్డాతో భేటీ అయిన విజయశాంతి!

Vijayashanti met with JP Nadda
  • బండి సంజయ్ తో భేటీకి ముందే నడ్డాను కలిసిన విజయశాంతి
  • బీజేపీలో చేరబోతున్న రాములమ్మ
  • అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆమెతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. బీజేపీలో చేరాలని ఆమెను ఆహ్వానించారు. మరోవైపు మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. బండి సంజయ్ కంటే ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆమె ఇటీవల సమావేశమయ్యారనేది ఆ వార్త సారాంశం. బీజేపీకి చెందిన ఓ ప్రధాన నేత ఈ విషయాన్ని వెల్లడించారు. బండి సంజయ్ తో సమావేశానికి ముందు నడ్డాతో విజయశాంతి భేటీ అయ్యారని ఆయన తెలిపారు. ఈ సమావేశం ఢిల్లీలో జరిగిందని చెప్పారు.

మరోవైపు విజయశాంతిపై బండి సంజయ్ ఇటీవల ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక గొప్ప నాయకురాలని కితాబిచ్చారు. అయితే, అందరు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసినట్టే ఆమెకు కూడా కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. విజయశాంతి కూడా నిన్న బీజేపీకి మద్దతుగా ట్వీట్ చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కాషాయ కండువాను విజయశాంతి కప్పుకోబోతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.
Vijayashanti
Congress
BJP
Kishan Reddy
Bandi Sanjay

More Telugu News