Chiranjeevi: నాకు కరోనా సోకింది.. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను: మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi tests corona positive
  • ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని టెస్ట్ చేయించుకున్నా
  • నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు
  • వెంటనే  హోమ్  క్వారంటైన్ అయ్యాను
  • నన్ను కలిసినవారందరు టెస్ట్ చేయించుకోవాలి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్ లో పాల్గొనడం కోసం పరీక్ష చేయించుకోగా తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు.

‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. వెంటనే  హోమ్  క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవలసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా కరోనా నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే.              
Chiranjeevi
Tollywood
Corona Virus
COVID19

More Telugu News