arnab goswamy: జైలులో ఫోన్ వాడిన అర్నాబ్.. మరో జైలుకి తరలింపు!

arnab uses phone in jail
  • ప్రస్తుతం జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో అర్నా‌బ్
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుండడంతో అనుమానం
  • జైలులో మరొకరి ఫోను వినియోగం
మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు ఇటీవల రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 2018లో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న అర్నా‌బ్ గోస్వామి జైలులో ఫోన్ ఉప‌యోగిస్తుండడంతో అధికారులు ఆయ‌న‌ను మ‌రో జైలుకు త‌రలించారు.


సోష‌ల్ మీడియాలో అర్నాబ్ యాక్టివ్ గా ఉంటుండడంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి, తనిఖీ చేయగా ఆయ‌న మ‌రొక‌రి ఫోన్‌ను వినియోగిస్తున్నాడ‌ని అధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనను అక్క‌డి నుంచి రాయ్‌గ‌ఢ్ జిల్లాలోని త‌లోజా జైలుకు త‌ర‌లించారు. ఆయ‌న వాడిన ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.


arnab goswamy
jail

More Telugu News