Corona Virus: దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు

85 lakhs corona cases in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 48,405 మంది కోలుకున్నారు.

 గడచిన 24 గంట‌ల సమయంలో 490 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,26,611 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,17,373 మంది కోలుకున్నారు. 5,09,673 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,85,72,192 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,35,401 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News