ఐపీఎల్ క్వాలిఫయర్-2: సన్ రైజర్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- అబుదాబిలో ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్
- సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
- బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ప్లేఆఫ్స్ దశలో తొలి క్వాలిఫయర్ లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఢిల్లీ ఓటమిపాలవగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరును ఇంటికి పంపిన సన్ రైజర్స్ క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఇక, నేటి మ్యాచ్ విషయానికొస్తే... సాహా ఇంకా కోలుకోకపోవడంతో సన్ రైజర్స్ జట్టులో గోస్వామినే కొనసాగించనున్నారు. ఢిల్లీ జట్టులో ప్రవీణ్ దూబే, హెట్మెయర్ తుదిజట్టులోకి వచ్చారు.