Pooja Hegde: అక్షరాన్ని మార్చగలరేమో కానీ అభిమానాన్ని కాదు: వివాదంపై వివరణ ఇచ్చిన పూజా హెగ్డే

Actress Pooja Hegde clarifies allegations on her
  • పూజాహెగ్డేపై విమర్శలు
  • కించపరిచే వ్యాఖ్యలు చేసిందంటూ దుమారం
  • తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడూ రుణపడి ఉంటానని వెల్లడి
తెలుగులో ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అయితే ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇక్కడి ప్రేక్షకులకు అంగాంగ ప్రదర్శన అంటేనే ఇష్టమని పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో పూజాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు. తాను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

"నేను ఒక ఇంటర్వ్యూలో అనని మాటలను అన్నట్టుగా రాశారు. ఒక సందర్భానికి తగినట్టు అన్న మాటలను మరో సందర్భానికి తగినట్టుగా అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ అభిమానాన్ని కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే నాకు ఎప్పటికీ ప్రాణంతో సమానం. ఈ విషయం నా సినిమాలను అభిమానించేవారికి, నా అభిమానులకు తెలుసు. అయినప్పటికీ ఎలాంటి అపార్థాలకు చోటు ఉండకూడదనే మరోసారి చెబుతున్నా... నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓసారి నా ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి" అంటూ తన ప్రకటనలో వెల్లడించారు.
Pooja Hegde
Statement
Comments
Interview
Tollywood

More Telugu News