అమీర్ పేటలో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిని అరెస్ట్ చేసిన పోలీసులు... వీడియో ఇదిగో!
- హైదరాబాదులో ఘటన
- పోలీసుల అదుపులో పోకిరీ
- సామాజిక మాధ్యమాల్లో వీడియో
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రాగా, ఓ పోలీసును చొక్కా పట్టుకుని దాడికి యత్నించాడు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఆ పోకిరీ అమీర్ పేట బస్టాండులో పోలీసులపైనే జులుం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.