'బిగ్ బాస్' లీక్... నేడు అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్!

Amma Rajashekhar Elimination Today in Biggboss
  • ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు ఎలిమినేట్
  • నేడు మాస్టర్ వెళ్లనున్నారంటున్న లీక్ వీరులు
  • మరికొన్ని గంటల్లో టీవీలో ఎపిసోడ్
రెండు నెలల క్రితం మొదలైన టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, నేడు జరిగే ఎలిమినేషన్ లో అమ్మ రాజశేఖర్ హౌస్ నుంచి బయటకు వచ్చేయనున్నారని లీక్ వీరులు తేల్చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే, మాస్టర్ కు తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. వాస్తవానికి గతవారంలోనే మాస్టర్ హౌస్ ను వదిలి రావాల్సివుంది.

అమ్మ రాజశేఖర్ ను బ్యాగ్ సర్దుకోవాలని చెప్పిన హోస్ట్ నాగార్జున, చివరి క్షణాల్లో సేవ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, నేటి ఎపిసోడ్ లో మాస్టర్ హౌస్ బయటకు వస్తారా? ఎలిమినేషన్ ఎపిసోడ్ ఎలా సాగుతుంది? తన చేతికి లభించే బాంబ్ ను మాస్టర్ ఎవరిపై ప్రయోగిస్తారు? అన్న విషయం తెలియాలంటే, మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.   
Go Back to Shorts
Bigg Boss
Elimination
Amma Rajashekhar
Master

More Telugu News