హనీమూన్ కి బయలుదేరుతున్న కాజల్ జంట!
- ఇటీవలే ప్రియుడిని వివాహమాడిన కాజల్
- సన్నిహితుల మధ్య సింపుల్ గా జరిగిన పెళ్లి
- హనీమూన్ కి వెళుతున్నట్టు ఈ రోజు హింట్
ఈ విషయాన్ని కాజల్ డైరెక్టుగా చెప్పనప్పటికీ, ఇన్ స్టాగ్రామ్ లో ఈ రోజు చిన్న హింట్ ఇచ్చింది. బ్యాగేజి, పాస్ పోర్టుల ఫొటోలు పోస్ట్ చేసి.. 'బ్యాగులు సర్దుకున్నాం'.. 'బయలుదేరడానికి సిద్ధంగా వున్నాం' అంటూ ఆ ఫొటోలపై క్యాప్షన్స్ ఇచ్చింది. హనీమూన్ కి వెళుతున్న విషయాన్ని అలా చెప్పకనే చెప్పేసిందన్నమాట. అయితే, ఏ ప్రదేశానికి వెళుతున్నదీ అమ్మడు చెప్పలేదు. నెటిజన్లకు విషయం అర్థం కావడంతో 'హ్యాపీ జర్నీ' అంటూ కాజల్ జంటకు విషెస్ చెబుతున్నారు.