Rocket: శ్రీహరికోటలో భారీ వర్షం... ఆలస్యంగా నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-49

Rocket launching in Sriharikota
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్యాహ్నం 3.02 గంటలకు నింగిలోకి దూసుకెళ్లాల్సిన పీఎస్ఎల్వీ సీ-49 కొన్ని నిమిషాల ఆలస్యంగా ఎట్టకేలకు నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం జరుగుతున్న శ్రీహరికోటలో భారీ వర్షం పడుతుండడమే అందుకు కారణం. ఈ ప్రయోగం 10 నిమిషాలు ఆలస్యం అయింది. పరిస్థితులు అనుకూలించడంతో రాకెట్ ను 3.12 గంటలకు ప్రయోగించారు. ఈ మేరకు మిషన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా ఈఓఎస్-01 ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
Go Back to Shorts
Rocket

More Telugu News