సినీ నటి పూనం పాండేను అరెస్ట్ చేసిన గోవా పోలీసులు
- గోవాలోని డ్యాం వద్ద అసభ్యకర వీడియోను చిత్రీకరించిన పూనం పాండే
- పోలీసులకు ఫిర్యాదు చేసిన నీటి వనరుల శాఖ
- స్టార్ హోటల్ లో ఉన్న పూనంను అరెస్ట్ చేసిన పోలీసులు
పూనం పాండేపై నిన్న పోలీసు కేసు నమోదైంది. కనకోనా టౌన్ లో ఉన్న చపోలీ డ్యామ్ వద్ద ఫొటో షూట్ చేసిందంటూ గోవా రాష్ట్ర నీటి వనరుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును నమోదు చేశారు. ఇదే సమయంలో పట్టణంలో పలువురు పూనంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్స్ పెక్టర్ తుకారం చవాన్, మరో కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హామీ ఇవ్వడంతో స్థానికులు బంద్ ఆలోచనను విరమించుకున్నారు.