Tirumala: రేపటి నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి.. ప్రకటించిన టీటీడీ

Tiruma Srivari walk way opens from tomorrow
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. రేపటి (గురువారం) నుంచి మెట్ల మార్గంలో భక్తులను అనుమతించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే, ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనం టోకెన్లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్, అటవీ సిబ్బంది నడకదారిలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో తిరుమలకు దారితీసే రెండు ఘాట్ రోడ్లు, మెట్ల మార్గాన్ని అప్పట్లో మూసివేశారు. ఆ తర్వాత మెట్ల మార్గం తెరుచుకోవడం ఇదే తొలిసారి.
Go Back to Shorts
Tirumala
Tirupati
Lord Venkateswara
walk way

More Telugu News