Rahul Sipligunj: హిమజ నటిస్తున్న 'జ' చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్

  • హారర్ థ్రిల్లర్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న హిమజ
  • హిమజ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల
  • సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వంలో వస్తున్న 'జ'
Rahul Sipligunj releases Himaja new movie first look

బిగ్ బాస్-3 రియాలిటీ షోతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలు రాహుల్ సిప్లిగంజ్, హిమజ బయట కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హిమజ 'జ' అనే హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రాహుల్ సిప్లిగంజ్ రిలీజ్ చేశాడు. హిమజ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాహుల్ సిప్లిగంజ్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. బిగ్ బాస్-3 ఫేమ్ శివజ్యోతి కూడా ఈ కార్యక్రమంలో తళుక్కుమంది.

కాగా, హిమజ లీడ్ రోల్ పోషిస్తున్న 'జ' చిత్రానికి సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వం వహిస్తున్నాడు. సైదిరెడ్డికి దర్శకుడిగా ఇదే తొలిచిత్రం. ఈ సినిమాను జైదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గోవర్ధన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తున్నారు.

More Telugu News