అన్ని రంగాల్లో సహకరిస్తున్నా, ఈ అసత్య ప్రచారాలేంటి?: కేసీఆర్‌పై లక్ష్మణ్ ఫైర్
- తెలంగాణకు ఇప్పటి వరకు రూ. 70 వేల కోట్ల నిధులు
- దోచుకోడానికి అవకాశం ఉండదనే విద్యుత్ బిల్లుపై అసత్య ప్రచారాలు
- దళారులకు నష్టం కలుగుతుందనే వ్యవసాయ బిల్లుపై తప్పుడు ప్రచారం
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దోచుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని నూతన విద్యుత్ బిల్లుపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళారులకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతోనే వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.