'వేదాళం' రీమేక్ లో చిరంజీవి సోదరిగా బిజీ స్టార్ ఎంపిక!
- 'ఆచార్య' తర్వాత వేదాళం రీమేక్ లో చిరంజీవి
- స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు మెహర్ రమేశ్
- సోదరి పాత్రకు సాయిపల్లవి, కీర్తి సురేశ్ పేర్ల పరిశీలన
- చివరికి కీర్తి సురేశ్ కి దక్కిన అవకాశం
ఇక ఈ చిత్రంలో హీరో సోదరి పాత్ర ఒకటి వుంది. ఇది చాలా కీలకమైన పాత్ర కావడంతో దీనికి హోమ్లీ ఇమేజ్ తో పాటు అభినయాన్ని ప్రదర్శించగలిగే కథానాయికను తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో సాయిపల్లవి, కీర్తి సురేశ్ లను పరిశీలించారు. చివరికి కీర్తి సురేశ్ వైపు చిరంజీవి మొగ్గు చూపించడంతో ఆమెను ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె డేట్స్ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారట.
మరోపక్క, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి గుండుతో కనిపిస్తారని అంటున్నారు. అందుకే ఆమధ్య గుండు గెటప్ తో ట్రయిల్ ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఆయన వదిలారు.