సిద్ధాపురం వద్ద నారా లోకేశ్ కు తప్పిన ప్రమాదం

26-10-2020 Mon 14:52
  • ట్రాక్టర్ నడిపిన లోకేశ్
  • ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన వైనం
  • వెంటనే ట్రాక్టర్ ను అదుపు చేసిన ఎమ్మెల్యే రామరాజు
Nara Lokesh escape an accident at Sidhapuram

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన ఇవాళ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద నారా లోకేశ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఉప్పుటేరు కాలువలోకి వెళ్లింది. అయితే ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్ ను అదుపు చేశారు. దాంతో లోకేశ్ కు ప్రమాదం తప్పినట్టయింది. లోకేశ్ సురక్షితంగా బయటపడడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.