ఆశాజనకంగా కరోనాపై పోరాటం... తగ్గుతున్న మహమ్మారి ప్రభావం
- గత నవంబరులో మొదలైన కరోనా ప్రభావం
- ప్రపంచదేశాలపై పంజా విసిరిన కరోనా
- ఇప్పటివరకు 4.33 కోట్ల మందికి పాజిటివ్
- కోలుకున్న 3.19 కోట్ల మంది
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4,33,06,185 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,19,04,913 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఒక శాతం బాధితుల పరిస్థితి మాత్రమే విషమంగా ఉండగా, 99 శాతం మంది ఆరోగ్య స్థితి మెరుగ్గానే ఉన్నట్టు వైద్య నివేదికలు చెబుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచం మొత్తమ్మీద 11,59,093 మంది ప్రాణాలు కోల్పోయారు.