చైనా, పాకిస్థాన్ తో యుద్ధం ఎప్పుడు చేయాలనేది మోదీ డిసైడ్ చేశారు: యూపీ బీజేపీ చీఫ్
- అర్టికల్ 370 రద్దు, రామ మందిరం మాదిరే యుద్ధంపై కూడా నిర్ణయం తీసుకున్నారన్న స్వతంత్ర దేవ్
- వీడియో క్లిప్పింగ్ ను పోస్ట్ చేసిన ఎమ్మెల్యే
- చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా స్వతంత్ర దేవ్ అక్కడున్న వారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను సంజయ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాశమైంది.