తెలంగాణలో 2.30 లక్షలు దాటిన కరోనా కేసులు

Telangana corona cases crossed to 2 lakh 30 thousand
  • నిన్న హైదరాబాద్ పరిధిలో 227 కేసులు
  • రాష్ట్రంలో ఇంకా 19,937 యాక్టివ్ కేసులు
  • వైరస్‌ను జయించిన  2,09,034  మంది బాధితులు
తెలంగాణలో నిన్న కొత్తగా 1,273 మంది కరోనా బారినపడ్డారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన బాధితుల సంఖ్య 2,30,274కు పెరిగింది. కరోనా కారణంగా నిన్న ఐదుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,303కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న 227 మందికి వైరస్ సంక్రమించింది. కరోనా కోరల నుంచి నిన్న 1,708 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,09,034 మంది వైరస్‌ను జయించి బయటపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 19,937 కేసులు యాక్టివ్‌గా ఉండగా, వీరిలో 16,809 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Hyderabad
GHMC
Telangana
Corona Virus

More Telugu News