‘డియర్ శివాత్మిక.. ధైర్యంగా ఉండు’ అంటూ రాజశేఖర్ కూతురికి చిరంజీవి ట్వీట్!

22-10-2020 Thu 13:34
  • రాజశేఖర్‌కు ఆసుపత్రిలో చికిత్సపై చిరు స్పందన
  • డా.రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
  • ఆయనకు, మీ కుటుంబానికి మా ప్రార్థనలు తోడుంటాయి
Wishing your loving dad and my colleague and friend

కరోనాపై తన తండ్రి, సినీనటుడు రాజశేఖర్ చేస్తోన్న పోరాటం క్లిష్టంగా ఉందని, అయినప్పటికీ బాగా పోరాడుతున్నారని ఆయన కూతురు శివాత్మిక ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని కోరుతున్నానని ఆమె పేర్కొంది. ఆమె ట్వీట్లపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

శివాత్మిక చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ... ‘డియర్ శివాత్మిక.. మీ తండ్రి, నా సహచరుడు, స్నేహితుడు డా.రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయనకు, మీ కుటుంబానికి మా ప్రార్థనలు తోడుంటాయి.. ధైర్యంగా ఉండు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, రాజశేఖర్ కుటుంబ సభ్యులందరికీ ఇటీవల కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.